ग्लोबल लीडरशिप समिट नए विचारों, कार्रवाई योग्य अवधारणाओं, नेतृत्व सिद्धांतों और हार्दिक प्रेरणा का मिश्रण है। यह आपके लिए आपके नेतृत्व में सुसज्जित और प्रेरित करने के लिए तैयार विश्व स्तरीय संकाय से नेतृत्व अंतर्दृष्टि के धन तक पहुंचने का अवसर है – चाहे आपका प्रभाव कहीं भी हो।
ఫౌండింగ్ మరియు సీనియర్ పాస్టర్, లైఫ్.చర్చ్ బెస్ట్-సెల్లింగ్ రచయిత
ఫౌండర్, హ్యాబిట్స్ అకాడమీ బెస్ట్-సెల్లింగ్ రచయిత
సామాజిక వ్యవస్థాపకుడు, ప్రసారకర్త రచయిత & వక్త వ్యవస్థాపకుడు, ది శాంక్చురీ ఫౌండేషన్
లీడ్ పాస్టర్, హోప్ రిస్టోరేషన్ మినిస్ట్రీస్ లీడర్షిప్ కన్సల్టెంట్, రచయిత
పాస్టర్, రచయిత, వక్త
భారత సైన్యం; గిడియాన్స్ ఇంటర్నేషనల్ మాజీ దక్షిణాసియా డైరెక్టర్
సీఏ; విద్యావేత్త; విద్యారంగంలో 'సూరత్ నగర ఐకాన్'
ది చోజెన్ యొక్క సృష్టికర్త, దర్శకుడు మరియు సహ-రచయిత
వక్త, రచయిత, పాస్టర్, విల్లో క్రీక్ కమ్యూనిటీ చర్చ్
© 2024 The Global Leadership Summit • All Rights Reserved
ఫౌండింగ్ మరియు సీనియర్ పాస్టర్, లైఫ్.చర్చ్
బెస్ట్-సెల్లింగ్ రచయిత
ప్రపంచవ్యాప్తంగా నాయకుల యొక్క నాయకునిగా గుర్తింపు పొందిన క్రెయిగ్ గ్రోషెల్ Life.Church వ్యవస్థాపకుడు మరియు సీనియర్ పాస్టర్. పరిచర్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో పేరుగాంచిన Life.Church 40 క్యాంపస్‌లలో ఆన్లైన్లో మరియు భౌతికంగా వారానికి 85,000 మందికి పైగా హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కంటే ఎక్కువ డౌన్లోడ్లను కలిగి ఉన్న YouVersion బైబిల్ యాప్ యొక్క వినూత్న సృష్టికర్తయిన Life.Church 2020లో కోవిడ్ సమయంలో చర్చిలకు ఉచిత వర్చ్యు వల్ సేవలను అందించడంలో కీలకపాత్ర పోషించింది. ది గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ తరపున , ఆయన సమాజంలోని ప్రతి రంగంలో నాయకులను సన్నద్ధం చేస్తున్నారు. ఆయన న్యూయార్క్ టైమ్స్ బెస్ట్-సెల్లింగ్ రచయిత మరియు అగ్రస్థానంలో ఉన్న క్రెయిగ్ గ్రోషెల్ లీడర్షిప్ పాడ్‌కాస్ట్ హోస్ట్.
ఫౌండర్, హ్యాబిట్స్ అకాడమీ
బెస్ట్-సెల్లింగ్ రచయిత
జేమ్స్ క్లియర్ అలవాటును రూపొందించడంలో ప్రపంచంలోని ప్రముఖ నిపుణులలో ఒకరు. ఆయన రాసిన న్యూయార్క్ టైమ్స్ బెస్ట్- సెల్లింగ్ బుక్, అటామిక్ హ్యాబిట్స్, ప్రపంచవ్యాప్తంగా 1 కోటికి పైగా కాపీలు అమ్ముడయ్యాయి, 50 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది, అమెజాన్‌లో 2021లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకంగా మొదటి స్థానంలో నిలిచింది మరియు ఆడిబుల్‌లో నంబర్ వన్ ఆడియోబుక్ గా కూడా ఉంది. సంక్లిష్ట విషయాలను రోజువారీ జీవితంలో మరియు పనిలో సులభంగా అన్వయించుకోగల సాధారణ ప్రవర్తనలుగా మార్చగల సామర్ధ్యం గల వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన, క్లియర్ యొక్క “3-2-1” ఇమెయిల్ న్యూస్ లెటర్ ప్రతి వారం 10 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులకు పంపబడుతుంది. ఆయన మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ మరియు గూగుల్‌తో సహా అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీలలో తన బోధనలను అందించారు. ఆయన రచనలు టైమ్, ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు CBS దిస్ మార్నింగ్ లో ప్రచురించబడ్డాయి.
సామాజిక వ్యవస్థాపకుడు, ప్రసారకర్త
రచయిత & వక్త
వ్యవస్థాపకుడు, ది శాంక్చురీ ఫౌండేషన్
డా. క్రిష్ కందియా ఒక సామాజిక వ్యవస్థాపకుడు, ఆయన సమాజంలో సంక్లిష్టంగా కనిపించే సమస్యలు పరిష్కరించడం కోసం పౌర సమాజం, విశ్వాస సంఘాలు, ప్రభుత్వం మరియు మానవతావాదులతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలనుకునే దర్శనంతో ఉన్నాడు. ఆయన శాంక్చురీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు, ఇది యునైటెడ్ కింగ్డమ్లో శరణార్థులను చేర్చుకొని, వారికి ఉపాధి మరియు నివాస వసతి కల్పిస్తుంది. క్రిష్ శరణార్థుల పునరావాసం, శిశు సంక్షేమ సంస్కరణలు, విద్యా ఆవిష్కరణలు మరియు పౌర సమాజ సమీకరణలో నిపుణుడిగా విస్తృతంగా గుర్తింపు పొందారు. ఆయన UK ప్రభుత్వం యొక్క అడాప్షన్ మరియు స్పెషల్ గార్డియన్షిప్ లీడర్షిప్ బోర్డ్‌కు చైర్‌గా కూడా పనిచేస్తున్నాడు, అక్కడ అయాన్ సంరక్షణ వ్యవస్థలో ఉన్న పిల్లల కోసం శాశ్వత ప్రేమగల కుటుంబాలను కనుగొనడంలో వ్యూహాత్మక నాయకత్వాన్ని వహిస్తున్నాడు. ఆయన జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పెంపుడు తండ్రి, దత్తత తండ్రి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఉన్న పిల్లల యొక్క ప్రతినిధి.
లీడ్ పాస్టర్, హోప్ రిస్టోరేషన్ మినిస్ట్రీస్
లీడర్షిప్ కన్సల్టెంట్, రచయిత
పాస్టర్ క్రిస్ మథేబులా హోప్ రిస్టోరేషన్ మినిస్ట్రీస్ యొక్క లీడ్ పాస్టర్ మరియు విజనరీ. ఏడు క్యాంపస్‌లతో కూడిన ఈ సమకాలీన చర్చి, గౌటెంగ్ అంతటా 20000 మంది సభ్యుల సమాజానికి సేవలు అందిస్తోంది, దీని ప్రధాన క్యాంపస్ దక్షిణాఫ్రికాలోని కెంప్టన్ పార్క్‌లోని క్లోర్కాప్ లో ఉంది. ఆయన ది పీపుల్ మేటర్ టు గాడ్ ఫౌండేషన్ అనే మానవతా సంస్థ, అలాగే డివోటెడ్ సిటిజన్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు. క్రిస్ ఒక అంకితభావంగల పౌరుడు, రచయిత, కాలమిస్ట్, అలాగే నాయకత్వ సలహాదారు. ఆయన టీవీ ప్రోగ్రామ్, “హోప్ అలైవ్” ఫెయిత్ టీవీ, వన్ గోస్పెల్, ట్రేస్ గోస్పెల్ మరియు ఇతర స్థానిక టీవీ మరియు రేడియో స్టేషన్లలో క్రమం తప్పకుండా ప్రసారం అవుతుంది. ఆయన తొమ్మిది పుస్తకాలు రచించారు, ఇటీవల "డివోటెడ్ సిటిజెన్" అనే పుస్తకం రాశారు.
పాస్టర్, రచయిత, వక్త
ఎర్విన్ రాఫెల్ మెక్మానస్ ఒక మైండ్ ఆర్కిటెక్ట్ మరియు అవార్డు గెలుచుకున్న రచయిత మరియు కళాకారుడు. ఆయన రాసిన పుస్తకాలు 10 లక్షల కాపీల కన్నా ఎక్కువ అమ్ముడయ్యాయి మరియు డజనుకు పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. మైండ్ ఆర్కిటెక్ట్‌గా, మెక్మానస్ గత 30 సంవత్సరాలుగా CEOలు, ప్రొఫెషనల్ అథ్లెట్లు, సెలబ్రిటీలు, కోట్ల-డాలర్ల కంపెనీలు, విశ్వవిద్యాలయాలు మరియు ప్రపంచ నాయకులకు సలహాలు మరియు శిక్షణనిస్తూ గడిపారు మరియు ప్రజలుకు తమ అంతర్గత పరిమితులను నిర్వీర్యం చేసి, తమ వ్యక్తిగత మేధస్సును బయటకు తీసుకురావడంలో చేయడంలో ఆసక్తి చూపుతున్నారు. ఆయన రాసిన కొత్త పుస్తకం, మైండ్ షిఫ్ట్: ఇట్ డోస్ నాట్ టేక్ ఎ జీనియస్ టు థింక్ వన్ వన్, అక్టోబర్ 2023లో విడుదలయ్యింది.
భారత సైన్యం; గిడియాన్స్ ఇంటర్నేషనల్ మాజీ దక్షిణాసియా డైరెక్టర్క
ల్నల్ (రిటైర్డ్.) నవనీత్ చాబ్రా భారతదేశంలోని పూణేలోని ఖడక్ వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పూర్వ విద్యార్థి. 1987లో భారత సైన్యంలో అధికారిగా నియమితులైన ఆయన, 20 ఏళ్లపాటు భారత సైన్యంలో సేవలందించారు.
కెప్టెన్‌గా, ఆయన యాంటీ-టాంక్ మిస్సైల్ గ్రూప్ కు శిక్షకుడుగా ఉన్నారు. ఆయన రెండున్నర సంవత్సరాలకు పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) అయిన ఎలైట్ స్పెషల్ ఫోర్స్‌లో భాగంగా మేజర్‌గా పనిచేశాడు. కల్నల్‌గా ఆయన కశ్మీర్ లోయలోని ఉరీ దగ్గరనున్న నియంత్రణ రేఖ వద్ద పందొమ్మిది మంది అధికారులు మరియు తొమ్మిది వందల మంది సైనికులతో 14 రాజ్‌పుత్ తన సొంత బెటాలియన్‌కు నాయకత్వం వహించాడు.
సైన్యంలో ఆయన పదవీకాలం ఆయన్ను వ్యూహాత్మక మరియు కార్యాచరణాత్మక నాయకుడిగా తీర్చిదిద్దింది. నాయకత్వపు ప్రాథమిక సిద్ధాంతాలు ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన భారత సైన్యంలో సేవ చేస్తున్న సమయంలో, ఆయన మూడుసార్లు అవార్డు లభించింది, ఒకసారి గ్యాలంట్రీకి మరియు రెండుసార్లు విశిష్ట సేవలను అందించినందుకు.
కల్నల్ నవనీత్ ఇండియన్ ఆర్మీ నుండి ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు మరియు భారతదేశంలోని ది గిడియన్స్ ఇంటర్నేషనల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. ఆయన తన శక్తిసామర్థ్యాలు మరియు ప్రతిభను లాభాపేక్షలేని సంస్థలో ఉపయోగించాలనుకున్నాడు. ఆయన భారతదేశంలోని గిడియన్స్ ఇంటర్నేషనల్‌లో పదమూడు సంవత్సరాలు సేవలందించాడు మరియు తన పదమూడేళ్లలో కాలంలో భారతదేశంలోని గిడియన్స్ ఇంటర్నేషనల్అ నేక రెట్లు వృద్ధిని నమోదు చేసింది. 2019 నుండి 2022 వరకు నవనీత్ చైనాతో సహా 36 దేశాలతో కూడిన ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ గిడియన్స్ ఇంటర్నేషనల్ (అమెరికా)కి అంతర్జాతీయ డైరెక్టర్‌గా పనిచేశారు.
ప్రస్తుతం, ఆయన డల్లాస్ థియోలాజికల్ సెమినరీ నుండి మాస్టర్స్ ఇన్ థియాలజీని అభ్యసిస్తున్నాడు మరియు లాభాపేక్షలేని మూడు అంతర్జాతీయ సంస్థలకు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు.
సీఏ; విద్యావేత్త; విద్యారంగంలో 'సూరత్ నగర ఐకాన్'
డ్రూ జయచంద్రన్ ప్రతి విషయంలోనూ మార్గనిదేశకునిగా ఉన్నారు. విద్యావేత్తగా ఉండడం మాత్రమే కాకుండా, ఆయన ఒక రచయిత, చార్టర్డ్ అకౌంటెంట్, పరిశోధకుడు మరియు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడిన వక్త. కామర్స్ విద్యార్థుల కోసం సూరత్‌లో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలలో ఒకదానికి డైరెక్టర్‌గా, ఆయన ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థుల జీవితాల్ని మారుస్తున్నాడు.
ఆండ్రూకు విద్యా రంగంలో 'ఐకాన్ ఆఫ్ సూరత్' అనే బిరుదు లభించింది మరియు విద్య మరియు వ్యాపార రంగంలో అతని అపారమైన కృషిని గుర్తించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఆయన్ను '40 ఏళ్లలోపు ఉన్న 40 మంది వ్యాపారవేత్తలు' లో ఒకరిగా ఎంపిక చేసింది.
ఆండ్రూ వివిధ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలలో గెస్ట్ లెక్చరర్‌గా ఉన్నారు, అనేక కార్యక్రమాలలో జ్యూరీ సభ్యునిగా మరియు ప్యానలిస్ట్‌గా పనిచేశారు మరియు వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లలో క్రమం తప్పకుండా రాస్తుంటారు. ప్రస్తుతం సూరత్‌లోని వైఎంసీఏ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.
ది చోజెన్ యొక్క సృష్టికర్త, దర్శకుడు మరియు సహ-రచయిత
25 సంవత్సరాల వయస్సులో, డల్లాస్ జెంకిన్స్ స్వంతంగా హోమ్టౌన్ లెజెండ్ అనే ఫీచర్ ఫిలింలను నిర్మించారు, దానిని వార్నర్ బ్రదర్స్ పంపిణీ చేశారు. అప్పటి నుండి 20 సంవత్సరాలలో, అతను యూనివర్సల్, లయన్స్‌గేట్, ప్యూర్ఫ్లిక్స్, హాల్‌మార్క్ ఛానెల్ మరియు అమెజాన్ కోసం డజనుకు పైగా ఫీచర్ మరియు షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించాడు మరియు నిర్మించాడు. అతను ఇప్పుడు అత్యంత అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ మీడియా ప్రాజెక్ట్, ది ఛోజెన్ అనే పేరుతో యేసు యొక్క జీవితాన్ని గూర్చిన బహుళ-సీజన్ సిరీస్‌కు రచయితగా, దర్శకునిగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచ సంచలనం, ది ఛోసెన్ చరిత్రలోనే అతిపెద్ద అభిమానుల మద్దతు ఉన్న ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా 52-కోట్ల-ఎపిసోడ్ వీక్షణలను పొందింది. ఇది అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ మరియు పీకాక్ వంటి ప్రధాన స్ట్రీమింగ్ సర్వీస్‌లలో అందుబాటులో ఉంది, అంతేగాక అన్ని సీజన్లను ది ఛోజెన్ మొబైల్ మరియు టీవీ యాప్‌లలో ఉచితం చూడవచ్చు. ఇది 50 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది మరియు స్పెషల్ ఈవెంట్ థియేట్రికల్ విడుదలలు దేశీయ బాక్సాఫీస్ వద్ద 3.5 కోట్ల డాలర్లకు పైగా వసూలు చేశాయి (కొన్ని వారాల్లోనే ఉచితంగా ప్రసారం అవుతుందని ప్రేక్షకులకు తెలిసినప్పటికీ).
వక్త, రచయిత, పాస్టర్, విల్లో క్రీక్ కమ్యూనిటీ చర్చ్
చర్చిలు, కాన్ఫరెన్సులు మరియు యూనివర్సిటీ చాపెల్స్ అంతర్జాతీయ వక్తగా, మేగాన్ ఫేట్ మార్ష్‌మాన్ ఈ తరానికి ప్రముఖ స్వరం. ఆమె ప్రస్తుతం విల్లో క్రీక్ కమ్యూనిటీ చర్చిలో టీచింగ్ పాస్టర్‌గా మరియు హ్యూమ్ లేక్ క్రిస్టియన్ క్యాంప్స్లో ఉమెన్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, ఆమె ప్రస్తుతం డాక్టరేట్ ఆఫ్ మినిస్ట్రీని పూర్తి చేస్తున్నారు.
ఆమె కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లోని అర్బోర్ రోడ్లో ఉన్న తన ఇంటి చర్చిలో మహిళలకు కాపరిగా కూడా చేస్తున్నారు. మేగన్ ఇటీవలే బ్యూటిఫుల్ వర్డ్ బైబిల్ స్టడీ: జాన్ (2022, హార్పర్ కాలిన్స్)ని విడుదల చేశారు. బైబిల్ స్టడీ బుక్, మీంట్ ఫర్ గుడ్ (2020, జోండర్వాన్), సెల్ఫ్ లెస్ (2017, డేవిడ్ సి కుక్) అనే పుస్తకాలు రచించారు మరియు ఆమె డాక్టర్ మిచెల్ ఆంథోనీ (2015, డేవిడ్ సి కుక్)తో కలిసి 7 ఫ్యామిలీ మినిస్ట్రీ ఎస్సెన్షియల్స్ అనే పుస్తకానికి రచించారు.
28th & 29th March 2023 | 7:00pm to 8:30pm