గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ సంస్థ నూతన ఆలోచనలు, క్రియాత్మక అంశాలు, నాయకత్వ సూత్రాలు మరియు హృదయాలకు ప్రేరణకలిగించేవాటియొక్క సంగమం. ప్రపంచ స్థాయి బోధకుల ఆధ్వర్యంలో మిమ్ములను సన్నద్ధంచేసి అనేకులను పురికొల్పుటకు, నాయకత్వంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.
తన రచన మరియు బోధన ద్వారా లక్షలాది మంది ప్రజలను చేరుకున్న లిసా టర్క్యూస్ట్ ప్రొవెర్బ్స్ 31 సంస్థకు అధ్యక్షురాలు మరియు కాంపెల్ రైటర్ ట్రైనింగ్ వ్యవస్థాపకురాలు. వీరి రచనలను అనేక ప్రచురణసంస్థలు ప్రచురించాయి, ఫాక్స్ న్యూస్, ఓప్రా మరియు ది టుడే షోలలో ప్రదర్శించబడ్డాయి మరియు వారి రచనకు ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్ అవార్డును అందుకున్నారు. అత్యధికంగా అమ్ముడైన 20 కి పైగా పుస్తకాల రచయిత, ఆమె నూతనంగా “ఇట్స్ నాట్ సపోజ్డ్ టు బి దిస్ వే: ఫైండింగ్ అన్ ఎక్ష్పెక్టెడ్ స్ట్రెంగ్త్ వెన్ డిసప్పాయింట్మెంట్స్ లీవ్ యు షాటర్డ్” అను పుస్తకాన్ని రచించారు.
ప్రపంచవ్యాప్తంగా హింస, దోపిడీ, బానిసత్వం మరియు అణచివేతకు గురైన బాధితులను రక్షించే ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IJM) కు గ్యారీ హౌగెన్ నాయకత్వం వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణా మరియు బానిసత్వమునకు వ్యతిరేఖంగా పోరాడినందుకుగాను అమెరికా ప్రభుత్వంయొక్క అత్యున్నత “హీరో” పురస్కారాన్ని పొందుకొన్నారు. వీరు మూడు పుస్తకములను రచించారు. వీరి రచనలకు ఫారిన్ అఫైర్స్, ద న్యూయార్క్ టైమ్స్ మరియు ఫోర్బ్స్ లొ చోటు దక్కింది.
డాక్టర్ చమోర్రో ప్రెముజిక్ సైకలాజికల్ ప్రొఫైలింగ్, టాలెంట్ మేనేజ్మెంట్ మరియు నాయకత్వ అభివృద్ధిలో నిపుణులు. వీరు మ్యాన్‌పవర్ గ్రూప్‌లో చీఫ్ టాలెంట్ సైంటిస్ట్, డీపర్ సిగ్నల్స్ మరియు, మెటా ప్రొఫైలింగ్ సహ వ్యవస్థాపకుడు మరియు యూనివర్శిటీ కాలేజ్ లండన్ మరియు కొలంబియా విశ్వవిద్యాలయంలో బిజినెస్ సైకాలజీ ప్రొఫెసర్. జెపి మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్, గూగుల్, బిబిసి మరియు పి అండ్ జి వంటి పేరుగాంచిన సంస్థలు వీరి సేవలను వినియోగించుకున్నాయి. 10 పుస్తకాలు మరియు 150 కి పైగా శాస్త్రీయ పత్రాల రచయిత. తన తరంలోని గొప్ప సామాజిక శాస్త్రవేత్తలలో ఒకరు.
2012 లో ఫెలోషిప్ చర్చిని స్థాపించడానికి ముందు టేట్ సంఘ పరిచర్యలకు సంబంధించిన గొప్ప నాయకత్వ పాత్రలను పోషించాడు. అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక సంఘమునకు నాయకులు. వీరు అజుసా పసిఫిక్ విశ్వవిద్యాలయం, ఫుల్లర్ యూత్ ఇన్స్టిట్యూట్ యొక్క సలహా మండలి మరియు గ్లోబల్ లీడర్షిప్ నెట్‌వర్క్‌తో సహా పలు సంస్థల బోర్డులో పనిచేస్తున్నాడు. డైనమిక్ కమ్యూనికేటర్ మరియు అద్భుతమైన వక్త, బైబిలు లేఖనాలను తనదైన చక్కనిహాస్యంతో మిళితంచేసి బోధించడంలో నేర్పరి. ఇటీవల వారి రచనలు “లెటర్స్ టు ఎ బర్మింగ్‌హామ్ జైలు: ఎ రెస్పాన్స్ టు ద వర్డ్స్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్” పత్రికలో ప్రచురించబడ్డాయి.
తన రచన మరియు బోధన ద్వారా లక్షలాది మంది ప్రజలను చేరుకున్న లిసా టర్క్యూస్ట్ ప్రొవెర్బ్స్ 31 సంస్థకు అధ్యక్షురాలు మరియు కాంపెల్ రైటర్ ట్రైనింగ్ వ్యవస్థాపకురాలు. వీరి రచనలను అనేక ప్రచురణసంస్థలు ప్రచురించాయి, ఫాక్స్ న్యూస్, ఓప్రా మరియు ది టుడే షోలలో ప్రదర్శించబడ్డాయి మరియు వారి రచనకు ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్ అవార్డును అందుకున్నారు. అత్యధికంగా అమ్ముడైన 20 కి పైగా పుస్తకాల రచయిత, ఆమె నూతనంగా “ఇట్స్ నాట్ సపోజ్డ్ టు బి దిస్ వే: ఫైండింగ్ అన్ ఎక్ష్పెక్టెడ్ స్ట్రెంగ్త్ వెన్ డిసప్పాయింట్మెంట్స్ లీవ్ యు షాటర్డ్” అను పుస్తకాన్ని రచించారు.
రెవ. పీటర్ శామ్యూల్, హైదరాబాద్‌లోని బేతేల్ మినిస్ట్రీస్ అధ్యక్షులు మరియు బేతేల్ ఇవాంజెలికల్ చర్చ్ సీనియర్ పాస్టర్. ఉద్యోగం చేస్తూ, దేవుని పరిచర్య చేయడానికి పిలువబడిన పీటర్, జాన్ మాక్స్వెల్ బృందంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన వృత్తి జీవితం 30 సంవత్సరాలకు పైగా ఉంది. వృత్తిపరమైన సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అపారమైన అనుభవాన్ని మరియు మేధా సంపత్తిని గడించారు. ఏప్రిల్ 2019 వరకు ఆయన హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ అయిన బెర్కాడియా ఇండియాకు కంట్రీ హెడ్‌గా పనిచేశాడు. ఆయన చర్చిలు, యువజన సమావేశాలు మరియు కార్పొరేట్ సమావేశాల్లో తరచూ ప్రసంగిస్తూ ఉంటారు. ఆయన సతీమణి గ్రేస్ నిరుపమ ఆయనతో కలిసి పరిచర్య చేస్తున్నారు. వీరికి కొడుకు నీరవ్ మరియు కూతురు లియోరా ఉన్నారు.
మీకు మరియు మీ బృందానికి నాయకత్వ సామర్థ్యమును పెంపొందించుటకు సహాయపడే ఉచిత నెలవారీ వీడియోల వీక్షణ.